Namaste NRI

ప్రధాని మోదీ హాజరు..డొనాల్డ్‌ ట్రంప్‌ గైర్హాజరు!

దక్షిణాఫ్రికాలో ఈ నెల 22, 23 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ నెల 21-23 తేదీల్లో ఆ దేశంలో ప్రధాని పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇండియా-బ్రెజిల్‌-దక్షిణాఫ్రికా (ఐబీఎస్‌ఏ) సమావేశంలోనూ పాల్గొననున్నారు. అయితే జీ20 సదస్సుకు ట్రంప్‌ హాజరుకాకపోవడం గమనార్హం.దక్షిణాఫ్రికాలో మైనార్టీలైన శ్వేతజాతి రైతుల పట్ల ఆ దేశం అనుసరిస్తున్న వివక్షను నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే డొనాల్డ్‌ ట్రంప్‌కు ఎదురుపడలేకే గతంలో పలు సదస్సులకు నేరుగా హాజరుకాని ప్రధాని మోదీ, జీ20 సదస్సుకు ట్రంప్‌ హాజరుకాకపోవడంతో ఇప్పుడు వెళ్తున్నారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events