Namaste NRI

ఫెయిల్యూర్‌ బాయ్స్‌ ఓ అద్భుతం

క్రాంతి, అవితేజ్‌, ప్రదీప్‌, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఫెయిల్యూర్‌ బాయ్స్‌. శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిలింస్‌ బ్యానర్‌ పై విఎస్‌ఎస్‌ కుమార్‌, ధన శ్రీనివాస్‌ జామి, లక్ష్మి వెంకట్‌ రెడ్డి నిర్మించారు. వెంకట్‌ త్రినాథ రెడ్డి ఉసిరిక దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో మేకర్స్‌ నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ముఖ్య అతిథి బాబు మోహన్‌ మాట్లాడుతూ ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాకు పాటలు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి అని తెలి పారు.

మనసు పెట్టి తీసిన సినిమా ఇది. ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్‌ అవ్వకుండా చాలా కష్టపడి చేశాం అని నిర్మాత శ్రీనివాస్‌ జమ్మి చెప్పారు. మరో నిర్మాత విఎస్‌ఎస్‌కుమార్‌ మాట్లాడుతూ ఫెయిల్యూర్‌ బార్సు అంటే ఎవరు ఉండరు. జీవితంలో ఒకసారి ఫెయిల్‌ అయితేనే జీవితంలో ఎలా పైకి రావాలో తెలుస్తుందని తెలిపే సినిమా ఇది అని అన్నారు. సెన్సార్‌ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చారు. కాబట్టి ప్రేక్షకులంతా కుటుంబ సమేతంగా వచ్చి ఈ చిత్రాన్ని చూడొచ్చు. ఈ సినిమా చూసి మీరు ఫీల్‌ గుడ్‌ అవుతారని హామీ ఇవ్వగలను అని దర్శకుడు వెంకట త్రినాథ రెడ్డి ఉసిరిక చెప్పారు. ఈ సినిమా ఈనెల 12న థియేట్రికల్‌ రిలీజ్‌కు సిద్ధమైంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events