Namaste NRI

మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది… లేకపోతే త్వరలోనే

ఇరాన్‌పై భారీ స్థాయి సైనిక చర్యను ప్రారంభిస్తే ఇజ్రాయెల్‌ ఏకాకిగా మిగిలిపోవచ్చని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహును ట్రంప్‌ హెచ్చరించారు. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య గత 24 గంటలుగా ఉద్రిక్తతలు పెరిగిన అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ బీబీ మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. లేకపోతే త్వరలోనే మీరు ఒంటరిగా మిగిలిపోతారు అని నెతన్యాహుకు చెప్పాను అని తెలిపారు.

తిరిగి ఘర్షణలు చెలరేగితే ఇరాన్‌తో దౌత్య ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలకు ఆటంకం కలుగవచ్చని, అంతేగాక అమెరికాను ప్రాంతీయ ఘర్షణలలోకి మరింత లోతుగా లాగవచ్చన్న తన ఆందోళన పెరుగుతున్నదని ట్రంప్‌ తెలిపారు. బీరుట్‌లోని హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్‌ దాడులు చేయడం, ఇందుకు ప్రతీకారంగా ఇరాన్‌ తన క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో మళ్లీ ప్రాంతీయ యుద్ధ భయాల నేపథ్యంలో నెతన్యాహుకు ట్రంప్‌ తాజా హెచ్చరికలు జారీచేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events