Namaste NRI

మెగాస్టార్ 158వ చిత్రానికి ముహూర్తం ఖరారు

మన శంకర వరప్రసాద్ గార తో హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించారు. దర్శకుడు బాబీ దర్శకత్వంలో రూపొందనున్న చిరంజీవి 158వ చిత్రం జనవరి 25న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ ఎన్‌కే నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి మరోసారి మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఈసారి మెగాస్టార్‌ని డైరెక్టర్‌ బాబీ మాస్‌ అవతార్‌లో చూపించనున్నారని, ఈ కథలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ ప్రధానంగా ఉంటాయని, చిరంజీవిని కొత్తగా చూపించాలనే కసితో బాబీ ఈ కథ రాసుకున్నారని తెలిసింది. కెవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకట్‌ కె.నారాయణ, లోహిత్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News