
రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కుతున్న సినిమా ‘పెద్ది ‘. మార్చి 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా ఏప్రిల్ 30న బాక్సాఫీస్ వద్దకు రానుంది. ఈ మేరకు కొత్త పోస్టర్ విడుదల చేసింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ను ప్రకటించిన కొన్ని క్షణాల్లోనే పెద్ది రిలీజ్ డేట్ ప్రకటించారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం. ‘పెద్ది’ సినిమా రామ్ చరణ్ నటిస్తున్న గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమా ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్, కన్నడ నటుడు రాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు.















