Skip to main content

Namaste NRI

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వాలీ భవనాల శంకుస్థాపన

అమరావతి క్వాంటం వ్యాలీ భవనాల శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, పీ నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ పాల్గొన్నారు. వారితో బాటు ప్రొఫెసర్ కామకోటి, ప్రొఫెసర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ మధుమూర్తి, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్, ఎల్ అండ్ టీ ప్రతినిధి సతీష్, టీసీఎస్ ప్రతినిధి హారిక్ విన్, ఐబీఎమ్ ప్రతినిధి అమిత్ సింఘీ కూడా ఉన్నారు. అనంతరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ క్వాంటం మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ 2025లో విజేతలుగా నిలిచిన బృందాలకు సర్టిఫికెట్లతో సహా నగదు బహుమతుల చెక్కులను అందించారు.

Social Share Spread Message

Latest News