హేమంత్ కుమార్, అయానా, గోపిక సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కన్నడ చిత్రం ఆల్ఫా. మెన్ లవ్ వెంజన్స్ ఉపశీర్షిక. విజయ్ ఎన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని నిర్మాతలు రవిశంకర్, మంజునాథ్ తెలుగులో విడుదల చేస్తున్నారు. సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. యాక్షన్, మాఫియా ఎలిమెంట్స్, ఫాదర్ సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌లో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. నేటి తరానికి నచ్చే కంటెంట్‌తో రూపొందించిన చిత్రమిదని నిర్మాతలు తెలిపారు.

హీరో హేమంత్ కుమార్ మాట్లాడుతూ నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. తెలుగు సినిమాలు ఎక్కువగా చూడటం వల్లే నాకు అంతో ఇంతో తెలుగు వచ్చింది. మా కోసం వచ్చిన సముద్ర గారికి థాంక్స్. రవిశంకర్ సార్ కన్నడలో మా కంటెంట్ చూసి నచ్చి ఈ చిత్రాన్ని తీసుకున్నారు. సినిమాలోని కంటెంట్ మీదున్న నమ్మకంతోనే ఈ మూవీని తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. నాలాంటి కొత్త వాళ్ల చిత్రాల్ని ఇలా ఎంకరేజ్ చేయడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులు పెట్టే డబ్బులకు సరిపోయే ఎంటర్టైన్మెంట్‌ను మేం అందిస్తాం. మా చిత్రంలోని కంటెంట్ బాగుంటుంది. ఎంతో నిజాయితీగా సినిమాని తీశాం. కన్నడలో మాకు మంచి స్పందన వస్తోంది. ఇక్కడ కూడా మాకు మంచి ఆదరణ దక్కుతుందని భావిస్తున్నాను అని అన్నారు.అచ్యుత్ కుమార్, బాలు నాగేంద్ర, కార్తీక్ మహేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: జె అనూప్ సీలిన్, నిర్మాత: ఆనంద్‌కుమార్, దర్శకత్వం: విజయ్ ఎన్.















