Namaste NRI

విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసిన హై మూవీ టీజర్‌

అనన్యశర్మ, ఎస్‌.కృష్ణ, పల్లవి దొర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం హై. అనిల్‌ రావిపూడి అసోసియేట్‌, రచయిత ఎస్‌.కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హరీష్‌ పెద్ది, ఎస్‌.కృష్ణ, శేఖర్‌ దివ్వెల నిర్మాతలు. ఈ చిత్ర టీజర్‌ను అగ్ర హీరో వెంకటేష్‌ విడుదల చేశారు. డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో సాగే న్యూఏజ్‌ మూవీ ఇదని, జీవితం తాలూకు ఉన్నతమైన ఆనందాన్ని వెతుక్కునే క్రమంలో నలుగురు వ్యక్తుల ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుందని దర్శకుడు తెలిపారు.

తెలుగులో ఇదొక డిఫరెంట్‌ జోనర్‌ చిత్రమని నిర్మాత హరీష్‌ పెద్ది అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్ర నిర్మాత దిల్‌రాజు, సురేష్‌బాబు, దర్శకుడు అనిల్‌ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మల్లు నాయక్‌, సునీల్‌ రెడ్డి, సంగీతం: వికాస బాదిసా, రచన-దర్శకత్వం: ఎస్‌.కృష్ణ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events