Namaste NRI

చరిత్ర చూడని వారియర్ స్వయంభు :నిఖిల్

నిఖిల్‌ వారియర్‌గా నటిస్తున్న పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా స్వయంభు. సంయుక్తమీనన్‌, నభా నటేష్‌ కథానాయికలు. భరత్‌ కృష్ణమాచారి దర్శకుడు. భువన్‌, శ్రీకర్‌ నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా థియేట్రికల్‌ త్రీడీ ఫార్మాట్‌ టీజర్‌ని హైదరాబాద్‌లోని ప్రసాద్‌ పిసిఎక్స్ థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిఖిల్‌ మాట్లాడారు.  మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉండటం వెనుక ఎంతోమంది త్యాగాలన్నాయి. ఈ విషయంలో అంతా రాజుల గురించి మాట్లాడతారు కానీ, ప్రాణత్యాగాలు చేసిన వారియర్స్‌ గురించి మాట్లాడరు. వెయ్యేళ్ల క్రితం రాయలసీమలోని చిత్తూరు ప్రాంతంలో కృష్ణ అనే వారియర్‌ ఉండేవాడు. అతడి కథే స్వయంభు. అల్లరిగా తిరిగే ఓ అండర్‌ డాగ్‌.. రాజ్యాలను శాసించే స్థాయికి ఎలా చేరాడు అనేది ఇందులో చూపించాం. ఫిక్షన్‌ ఎలిమెంట్స్‌ ఉన్నప్పటికీ ఇది నిజంగా జరిగిన కథ అని అన్నారు.

డైరెక్టర్‌ భరత్‌కృష్ణమాచారి రీసెర్చ్‌ చేసి ఈ కథ రాశారు. శ్రద్ధాభక్తులతో అన్ని జాగ్రత్తలూ తీసుకొని స్వయంభు చేశాను. అంతా గర్వపడేలా, సాంకేతికంగా అబ్బురపరిచేలా అంతర్జాతీయ విలువలతో ఈ సినిమా ఉంటుంది. ఈ టీజర్‌ పరిచయం మాత్రమే. ముందుముందు వచ్చే కంటెంట్‌తో ఆసకికరమైన ఎన్నో అంశాలను పరిచయం చేస్తాం అని నిఖిల్‌ తెలిపారు. శ్రీరాముడికి పరమేశ్వరుడు అందించిన సెంగోల్‌ను స్వాధీనం చేసుకునేందుకు జరిగే భీకర పోరాటమే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తమని టీజర్‌ ద్వారా దర్శకుడు భరత్‌కృష్ణమాచారి తెలియజేశారు. 985ఎ డి కాలంలో సాగే ఈ కథలో యుద్ధవీరుడిగా నిఖిల్‌ అద్భుతంగా నటించారని ఆయన పేర్కొన్నారు. ఇంకా డీఓపీ సెంథిల్‌కుమార్‌, కథానాయికలు సంయుక్త మీనన్‌, నభా నటేష్‌ కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events