Namaste NRI

అమెరికా ఆయుధాలతో తాలిబన్ల కవాతు

అఫ్గానిస్థాన్‌లో అధికారం చేపట్టిన తాలిబన్లు, అమెరికా, ఇతర దేశాల దళాలు వదిలివెళ్లిన ఆయుధాలతో బలప్రదర్శన నిర్వహించారు. ఆగస్టులో పౌర ప్రభుత్వం కుప్పకూలి తాలిబన్లు అధికారంలోకి రావడంతో వారు ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నారు. తాలిబన్‌ దళాల్లో 250 మంది సైనికులు కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కవాతు నిర్వహించారు. అమెరికాకు చెందిన ఎం 117 సాయుధ వాహనాలు, ఎం`17 హెలికాప్టర్లు, ఎం4 అసాల్ట్‌ తుపాకులు, రష్యా హెలికాప్టర్లను ఇందులో ప్రదర్శించారు. అఫ్గాన్‌ జాతీయ దళాల్లో పనిచేసిన పైలట్లు, మెకానిక్‌లను తమ బలగాల్లో చేర్చుకొంటున్నట్లు తాలిబన్‌ ప్రతినిధి వెల్లడిరచారు. తాలిబన్లు ఇటీవల మిలటరీ దుస్తులను వాడటం మొదలు పెట్టారు. గతంలో తాలిబన్‌ ఫైటర్లు కేవలం సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే కనిపించేవారు.

Social Share Spread Message

Latest News