Namaste NRI

విమాన ప్రయాణికులకు శుభవార్త

దేశీయ విమాన ప్రయాణికులకు శుభవార్త. అదనపు చార్టీల భారం నుంచి విమాన ప్రయాణికులు ఉపశమనం పొందనున్నారు. సీటు ఎంపిక కోసం చెల్లిస్తున్న అదనపు చార్జీలను తొలగించాలని ప్రభుత్వం విమానయాన సంస్థలను ఆదేశించింది. ఈ చర్య వల్ల విమాన టికెట్‌ చార్జీ తగ్గడమే గాకుండా అన్ని దేశీయ విమానాల్లోని 60 శాతం సీట్లను ఉచితంగా ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తుంది. బుకింగ్‌ తర్వాత లేదా వెబ్‌ చెక్‌-ఇన్‌ సమయంలో ప్రాధాన్యతా సీట్ల కోసం అదనపు చార్జీలను చెల్లించే విధానం ఇక అంతం కానున్నది.

అన్ని డొమెస్టిక్‌ విమానాల్లోని కనీసం 60 శాతం సీట్లకు అదనపు చార్జీలు వసూలు చేయవద్దని పౌర విమానయాన శాఖ ఎయిర్‌లైన్‌ సంస్థలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు కేవలం 20 శాతం సీట్లు మాత్రమే ఉచితంగా ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంది. అత్యధికంగా ప్రాధాన్యతా సీట్లకు ఎయిర్‌లైన్స్‌ అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఒకే పీఎన్‌ఆర్‌పై ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఒకే దగ్గర అవసరమైతే పక్కపక్కనే సీట్లు ఇవ్వాలని కూడా ఎయిర్‌లైన్స్‌ని మంత్రిత్వశాఖ ఆదేశించింది. పక్కపక్క సీట్ల కోసం అదనపు చార్జీలను చెల్లించే కుటుంబాలు, గ్రూపులకు ఈ చర్య ప్రయోజనం చేకూర్చనున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events