
తాను బతికే ఉన్నానంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరో వీడియోను విడుదల చేశారు. తాజా వీడియో క్లిప్‌లో నెతన్యాహు ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబారి మైక్ హకబీతో కలిసి కనిపించారు. తనపై వస్తున్న వదంతులను కొట్టిపారేస్తూ, అవును మైక్.. నేను బతికే ఉన్నా అని నెతన్యాహు చెప్పటం ఆ వీడియోలో వినిపించింది. మేము ఐదు వేళ్లతో కరచాలనం చేస్తాం అంటూ చమత్కరించారు. ఈ వీడియోను తన అధికారిక ఎక్స్ ఖాతాలో విడుదల చేశారు. ఇలా ఆయన వీడియోను విడుదల చేయటం ఇది 6వ సారి. వీడియోను పరిశీలించిన గ్రోక్ భిన్నమైన సమాధానాలు ఇచ్చింది. ఏఐతో సృష్టించినదిగా తొలుత పేర్కొన్నది. ఆ తర్వాత నిజమైన వీడియోగా తెలిపింది.















