Skip to main content

Namaste NRI

ఇరాన్‌ ధాటికి చేతులెత్తేసిన డొనాల్డ్‌ ట్రంప్‌

పశ్చిమాసియాలో గడిచిన 25 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల్లో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేసే విషయమై ఇరాన్‌తో గడిచిన రెండు రోజులుగా ఫలప్రదమైన చర్చలు కొనసాగుతున్నా యని తెలిపారు. ఈ క్రమంలో ఇరాన్‌లోని విద్యుత్తు కేంద్రాలతో పాటు ఇంధన మౌలిక సదుపాయా లపై ఐదు రోజుల వరకూ ఎలాంటి దాడులు చేయవద్దని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఇరాన్‌తో చర్చలు ఇలాగే కొనసాగుతాయని, చర్చల ఫలితాలను బట్టి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. అయితే, తమతో చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్‌ ప్రకటనను ఇరాన్‌ తోసిపుచ్చింది. అవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేసింది. తమ హెచ్చరికలతోనే ట్రంప్‌ భయపడిపోయి వెనక్కి తగ్గినట్టు పేర్కొన్నది.

Social Share Spread Message

Latest News