Namaste NRI

ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుకునేలా రాకాస ఉంటుంది : నిహారిక కొణిదెల

సంగీత్‌శోభన్‌, నయన్‌సారిక జంటగా నటించిన చిత్రం రాకాస. మానసశర్మ దర్శకురాలు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. గ్లింప్స్‌ నుంచే ఈ సినిమాపై భారీ హైప్‌ ఏర్పడిందని, ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే చిత్రమిదని, ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్‌ చేస్తారని చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల చెప్పింది. ఫాంటసీ, అడ్వెంచర్‌, ఫన్‌ కలబోసిన సినిమా ఇదని, రామ్‌చరణ్‌ ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడటం ధైర్యాన్నిచ్చిందని హీరో సంగీత్‌శోభన్‌ అన్నారు.

మన జానపద కథలు ఈ తరం వారు అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశామని, అందమైన చందమామ కథలా ఆకట్టుకుంటుందని దర్శకురాలు మానసశర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు. వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ, గెటప్‌ శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రాజు ఎదురురోలు, సంగీతం: అనుదీప్‌దేవ్‌, నిర్మాతలు: నిహారిక కొణిదెల, ఉమేష్‌ కుమార్‌ బన్సాల్‌, రచన-దర్శకత్వం: మానసశర్మ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events