Namaste NRI

మహావతార్‌ పరశురామ్‌ టైటిల్‌ పోస్టర్‌ రిలీజ్

నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ నుంచి రాబోతున్న మరో యానిమేటెడ్‌ దృశ్యకావ్యం మహావతార్‌ పరశురామ్‌. పరశురామ జయంతి సందర్భంగా మహావతార్‌ సినీమాటిక్‌ యూనివర్స్‌ని ప్రజెంట్‌ చేస్తూ ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ని, గ్లింప్స్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. గొడ్డలి చేతబట్టి నరమేధాన్ని సృష్టిస్తున్న పరశురాముడ్ని ఈ పోస్టర్‌లో చూడొచ్చు. పరశురాముడి ముఖాన్ని చూపించకుండా, ఆయన చేతిలో రక్తంతో తడిసిన పరశును(గొడ్డలి), రక్తంతో తడిచి ముద్దయిన యుద్ధభూమిని, దూరంగా భీతితో చూస్తున్న సైన్యాన్ని పోస్టర్‌లో చూపిస్తూ కథపై మరింత ఆసక్తిని పెంచారు మేకర్స్‌. మహావిష్ణు అవతారాల నుంచి స్ఫూర్తి పొందిన ఈ కథ మోడ్రన్‌ విజువల్‌ వండర్‌గా, గ్రేట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌తో అలరిస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. సామ్‌ సిఎస్‌ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events