సింగపూర్లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం పర్యటించింది. ఏపీ మంత్రుల బృందం ఏప్రిల్ చివరి వారంలో సింగపూర్లో వారం రోజుల పాటు “స్వర్ణ ఆంధ్ర విజన్ 2047” కోసం స్టడీ టూర్ నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, అనిత, సత్యకుమార్ యాదవ్, సత్యప్రసాద్, జనార్ధన్ రెడ్డి లు సింగపూర్ లోని స్మార్ట్ సిటీ మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరిపాలన, పారిశ్రామిక ప్రణాళికలు మరియు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లను పరిశీలించారు.

స్వర్ణ ఆంధ్ర విజన్ 2047’లో భాగంగా ప్రపంచస్థాయి పరిపాలన, నగర ప్రణాళిక, టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం.సింగపూర్ మాదిరిగా భూ వినియోగ విధానాలు, పారిశ్రామిక కారిడార్లు, అమరావతి అభివృద్ధికోసం అవసరమైన డిజిటల్ గవర్నెన్స్ నమూనాల ద్వారా మంత్రులు అధ్యయనం చేశారు.మంత్రుల పర్యటన విశేషాలను ప్రజెన్టేషన్ ద్వారా తెలియజేయాలని ముఖ్యమంత్రి కోరారు. మంత్రుల సింగపూర్ పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
















