Skip to main content

Namaste NRI

జోక్‌ చేయటం లేదు … మూడో టర్మ్‌ కూడా తానే

అమెరికా అధ్యక్షుడిగా మూడో టర్మ్‌ తానే కొనసాగుతానంటూ డొనాల్డ్‌ ట్రంప్‌, అధ్యక్ష పదవిపై కాంక్షను మరోమారు బయటపెట్టారు. అమెరికా అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో ఇప్పట్నుంచి 8-9 ఏండ్లు ఉంటానని, తానేమీ జోక్‌ చేయటం లేదని తాజాగా చెప్పారు. అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం, ఏ వ్యక్తి కూడా అధ్యక్ష పదవికి రెండుసార్ల కంటే ఎక్కువసార్లు ఎన్నికవడానికి వీలు లేదు. అయినప్పటికీ డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఈ మాటలు రావటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

అధ్యక్షుడిగా ట్రంప్‌ రెండవ టర్మ్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇది ముగిసిన తర్వాత మూడో పర్యాయం కూడా అధ్యక్ష పదవిలో తానే ఉంటానని 2025లో తన కోరికను బయటపెట్డారు. ఇందుకు రాజ్యాంగంలో కొన్ని మార్గాలు కూడా ఉన్నాయని ట్రంప్‌ చెప్పారు. ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ వైట్‌హౌస్‌లో నిర్వహించిన ఒక బిజినెస్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పట్నుంచీ 8 – 9 ఏండ్లు వైట్‌హౌస్‌లోనే ఉంటా. బయటకు పోను. నేను జోక్‌ చేయటం లేదు. ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకుంటా. అయితే, అసలు విషయం ఏమంటే, మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ప్రభుత్వ పాలనలో ఇది ప్రారంభ దశ మాత్రమే అని ట్రంప్‌ అన్నారు.

Social Share Spread Message

Latest News