ప్రముఖ నటుడు కమల్‌హాసన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడిరచారు. అమెరికా వెళ్లొచ్చిన తర్వాత కాస్త దగ్గుగా ఉండడంతో పరీక్షలు చేయించుకున్నారు. కొవిడ్ ఇన్ఫెక్షన్ ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నేను ఆస్పత్రిలోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనతో సన్నిహితంగా మెలిగిన పార్టీ కార్యకర్తలు, తన అభిమానులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పాజిటివ్‌గా తేలితే కొన్నిరోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు. కరోనా మహమ్మారి ఇంకా పోలేదు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి అని సూచించారు. ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు కమల్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.














