Namaste NRI

రావు బహదూర్‌ ఆగమనం అప్పుడే

వెర్సటైల్‌ యాక్టర్‌ సత్యదేవ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న సైకలాజికల్‌ డ్రామా రావు బహదూర్‌. దీపా థామస్‌ కథానాయిక . వెంకటేశ్‌ మహా దర్శకుడు. చింతా గోపాలకృష్ణరెడ్డి, అనురాగ్‌రెడ్డి, శరత్‌చంద్ర నిర్మాతలు. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌లో వయసు పైబడిన రాయల్‌ లుక్‌లో సత్యదేవ్‌ కనిపించారు. సైకలాజికల్‌ డ్రామాకు తగ్గట్టుగా ఓ ఇంటెన్స్‌ వాతావరణం ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నది.

ఈ చిత్రంలో వికాస్‌ ముప్పాల, బాలా పరాశర్‌, ఆనంద్‌ భారతి, ప్రణయ్‌ వాక, మాస్టర్‌ కిరణ్‌ ఇతర పాత్రధారులు. ఈ చిత్రాన్ని తొలుత జూన్ 5న విడుదల చేయాలని చిత్ర బృందం భావించినప్పటికీ, జూన్ 4న రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం పెద్ది విడుదల కానున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద క్లాష్‌ను తప్పించడానికి మేకర్స్ వెనక్కి తగ్గారు. తాజా సమాచారం ప్రకారం జూలై 3న సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్‌ పర్మార్‌, సంగీతం: స్మరణ్‌సాయి, నిర్మాణం: ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌, శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events