Skip to main content

Namaste NRI

చైనా పర్యటనకు అమెరికా అధ్యక్షుడు ..షెడ్యూల్ ఖరారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులు చైనా లో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడుజీ జిన్‌పింగ్‌ ఆహ్వానం మేరకు ట్రంప్‌ ఆ దేశ పర్యటనకు వెళ్తున్నారు. ట్రంప్‌ తమ దేశ పర్యటనకు వస్తున్నారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. దాదాపు తొమ్మిదేళ్ల అనంతరం ట్రంప్‌ అమెరికా అధ్యక్షుని హోదాలో చైనాకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

బుధవారం సాయంత్రానికల్లా ట్రంప్‌ బీజింగ్‌ చేరుకుంటారు. గురు, శుక్రవారాల్లో వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురువారం చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. ట్రంప్‌ చివరిసారిగా తన తొలి టర్మ్‌లో 2017లో అధ్యక్ష హోదాలో చైనాను సందర్శించారు. ఇరాన్‌తో యుద్ధం, హర్మూజ్‌ జలసంధి దిగ్బంధనం, ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారితీసిన పరిస్థితుల్లో ట్రంప్‌ చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Social Share Spread Message

Latest News