రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించే ఈ సినిమా సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని రాపో సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని నిర్మించనున్నారు. రామ్ పోతినేని జన్మదినం సందర్భంగా స్పెషల్ బర్త్‌డే పోస్టర్‌ను విడుదల చేశారు.ఇందులో ఆయన వీర పాత్రలో కనిపించనున్నారు. ది స్టోరీ ఆఫ్ ఏ లోన్ వూల్ఫ్ అనే క్యాప్షన్ ఆయన పాత్ర తాలూకు ఇంటెన్సిటీని ప్రతిబింబిస్తున్నది.

మానసిక సంఘర్షణతో కూడిన ఈ పాత్రలో రామ్ అగ్రెసివ్ యాటిట్యూడ్ కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడని, ఆయన మేకోవర్ ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి డిసెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని వెల్లడించనున్నారు.





























