Skip to main content

Namaste NRI

ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి : సూర్య

సూర్య వశిష్ట, దీప్షిక జంటగా నటించిన చిత్రం రమణీ కల్యాణం. విజయ్‌ ఆదిరెడ్డి దర్శకుడు. దర్శకుడు రామ్‌ జగదీష్‌ సంభాషణలందించారు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాటల రచయిత రామ్‌జగదీష్‌ మాట్లాడుతూ దర్శకుడు ఈ ఐడియా చెప్పినప్పుడు మేమంతా షాక్‌ అయ్యాం. కళ్లులేని అమ్మాయి, నడవలేని అబ్బాయి, వీరిద్దరి మధ్య నడిచే ప్రేమకథ ఇది. ఈ కథను స్క్రీన్‌ మీదకు తీసుకురావడం సవాలుగా అనిపించింది అన్నారు. ఈ కథలోని భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాల్ని కదిలిస్తాయని దర్శకుడు తెలిపారు.

హీరో సూర్య వశిష్ట మాట్లాడుతూ ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. మేము చాలా మంచి ప్రయత్నం చేశాం అని తెలిపారు.ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని హీరోయిన్ దీప్షిక చంద్రన్ చెప్పారు. కైట్స్‌ క్రియేటివ్‌ పతాకంపై విజయ్‌ ఆదిరెడ్డి, మనోజ్‌ చింతిరెడ్డి, శ్రీనాథ్‌ పసుపులేటి, సంజయ్‌ వెంపరాల ఈ చిత్రాన్ని నిర్మించారు.

Social Share Spread Message

Latest News