Namaste NRI

షార్లెట్ లో నాట్స్ (NATS) ఉచిత వైద్య శిబిరాని విశేష స్పందన

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ ( NATS) భాషే రమ్యం.. సేవే గమ్యం అని అమెరికాలో సేవలు అందిస్తోంది. నాట్స్ షార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రవాస తెలుగు వారి కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు, వ్యాధి నివారణ కోసం సలహాలు అందించడమే లక్ష్యంగా ‘క్రిస్య కేర్స్’ వేదికగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి స్థానికుల నుండి విశేష స్పందన లభించింది. సుమారు 50 మందికి పైగా రిజిస్టర్ చేసుకుని ఉచిత వైద్య సేవలు సలహాలు పొందారు.

ఈ కార్యక్రమంలో నలుగురు వైద్య నిపుణులు పాల్గొని అమూల్యమైన సేవలు అందించారు.గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. వినీత్ కొర్రపాటి, ఫ్యామిలీ ఫిజీషియన్ డా. కిషన్ మారంరాజ్,కార్డియాలజిస్ట్‌ డా. కార్తీక శఠగోపం, ఆంకాలజిస్ట్ డా. గీత వల్లభనేని ఈ వైద్య శిబిరానికి వచ్చి ఉచితంగా సేవలు అందించారు. ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసిన నాట్స్ ప్రతినిధులకు పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మెడికల్ క్యాంపు నిర్వాహణలో యువ వాలంటీర్స్ ను నాట్స్ అభినందించింది.ఈ కార్యక్రమానికి సహకరించిన వైద్యులు,వాలంటీర్స్, స్పాన్సర్ కు , షార్లెట్ చాప్టర్ నాయకులను నాట్స్ చైర్మన్ కిశోర్ కంచర్ల, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అభినందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events