Skip to main content

Namaste NRI

జూలైలో చెన్నై లవ్‌స్టోరీ

కిరణ్‌ అబ్బవరం, శ్రీగౌరిప్రియ జంటగా నటిస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చెన్నై లవ్‌స్టోరీ. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సాయిరాజేష్‌ కథనందిస్తున్నారు. ఈ సినిమాను జూలైలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు. చెన్నై నగరం నేపథ్యంలో జరిగే ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని, ప్రేమలోని సున్నిత భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ అందరినీ మెప్పిస్తుందని, సంగీతానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందని మేకర్స్‌ చెప్పారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్న లవ్‌స్టోరీ ఇదని, కిరణ్‌ అబ్బవరం పాత్ర నవ్యరీతిలో సాగుతుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కథ: సాయిరాజేష్‌, నిర్మాతలు: ఎస్‌కేఎన్‌, సాయిరాజేష్‌, రచన-దర్శకత్వం: రవి నంబూరి.

Social Share Spread Message

Latest News