Namaste NRI

భార‌త్‌కు స‌హ‌క‌రిస్తాం: పుతిన్

ఫిఫ్త్ జ‌న‌రేష‌న్ సుఖోయ్‌-57ని భార‌త్‌తో క‌లిసి సంయుక్తంగా ఉత్ప‌త్తి చేసేందుకు ర‌ష్యా అనుకూలంగా ఉంది. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. భార‌త విదేశాంగ విధానాన్ని పుతిన్ ప్ర‌శంసించిన విష‌యం తెలిసిందే. సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్‌లో జ‌రుగుతున్న స‌మావేశాల నేప‌థ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అక్క‌డ సుఖోయ్‌-57 యుద్ధ విమానం త‌యారీకి సంబంధించిన అప్‌డేట్ కూడా ఇచ్చారు. భార‌త్‌తో ర‌క్ష‌ణ స‌హ‌కారాన్ని మ‌రింత బ‌లోపేతం చేయ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. దీనిలో భాగంగానే స్టీల్త్ ఫైట‌ర్ విమానం సుఖోయ్‌-57ని రెండు దేశాలు క‌లిసి త‌యారీ చేయ‌నున్న‌ట్లు చెప్పారు.

అడ్వాన్స‌డ్ ఫైట‌ర్ జెట్ త‌యారీ అంశంలో భార‌త్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు. సుఖోయ్‌-57 విమానాన్ని సంయుక్తంగా డెవ‌ల‌ప్ చేసే అంశంలో భార‌త్‌కు స్నేహ హ‌స్తాన్ని చాచామ‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న యుద్ధ విమానాల్లో ఇదే బెస్ట్ అని తెలిపారు. సంయుక్తంగా ఈ యుద్ధ విమానం త‌యారీ అంశంలో భార‌త్‌పై ఎటువంటి వ‌త్తిడి ఉండ‌బోద‌న్నారు. అయితే ఈ అంశంపై కేంద్ర ర‌క్ష‌ణ శాఖ తుది నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంద‌ని భార‌త విదేశాంగ శాఖ చెప్పింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events