Namaste NRI

న్యూయార్క్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకులు న్యూయార్క్‌లో ఘనంగా నిర్వహించారు. న్యూయార్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) ఆధ్వర్యంలో బేత్ పేజ్ కమÖ్యనిటీ సెంటర్‌లో నిర్వహించారు. ఎన్నారై ప్రముఖులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, వెంకట్ మారోజు, నారాయణస్వామి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పాటైన తెలంగాణ మరింత అభివృద్ది చెందాలని, అందుకు తమవంతు సహకారం అందిస్తామని నైటా అధ్యక్షులు రవీందర్ కోడెల పేర్కొన్నారు. వేడుకల్లో మిమిక్రీ కళాకారుడు రమేష్, గాయకుడు అద్వైత్ బొందుగుల తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అశోక్ చింతకుంట వేసిన కొమరం భీమ్ ఏకపాత్రాభినయం అలరించింది. చిన్నారుల ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో ప్రవాస తెలంగాణవాసులు హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events