ఎన్నారై టిడిపి విల్మింగ్టన్ నగర కమిటీ ఆధ్వర్యంలో డెలావేర్ లోని మిడిల్ టౌన్ లో మినీ మహానాడు, ఎన్టీఆర్ 103 వ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. నటుడుగా, రాజకీయ నాయకుడిగా నందమూరి తారక రామారావు సాధించిన విజయాలను ఈ సందర్భంగా అభిమానులు టిడిపి కార్యకర్తలు గుర్తుకు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. తెలుగు భాషకు , తెలుగు వారికి గుర్తింపు తెచ్చిపెట్టిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందు తరాలకు అందించడమే ఎన్టీఆర్ కు ఘనమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సూపర్ 6 కార్యక్రమాలు రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను వస్తున్నందుకు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగర కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ పొన్నగంటి , ఉపాధ్యక్షులు శ్రీధర్ బాబు ఆలూరు, శ్రీకాంత్ గూడూరు, హరిబాబు తుబాటి, కిశోర్ కూకలకుట్ల, సందీప్ వెంపరాల, సంగమేశ్వర పంచుమర్తి , కళ్యాణ్ నవాన మొదలైన టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





























