Skip to main content

Namaste NRI

శాంతి ఒప్పందంపై అనిశ్చితి

అమెరికా,ఇరాన్‌ శాంతి ఒప్పందంపై మళ్లీ అనిశ్చితి ఏర్పడింది. తన 80వ పుట్టిన రోజైన ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నాం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన కార్యరూపం దాల్చలేదు. లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు జరపటంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అధ్యక్షుడు ట్రంప్‌ షెడ్యూల్‌లో ఒప్పందానికి సంబంధించి అధికారిక కార్యక్రమం లేదు. దీంతో ట్రంప్‌ చెబుతున్న ఒప్పందం, సిద్ధంగా ఉందా? లేదా? అసంపూర్ణంగా ఉన్న ప్రక్రియను పూర్తయిన ఒప్పందంగా చూపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, లెబనాన్‌పై దాడుల్ని ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది. ఇలాగైతే ప్రతిపాదిత ఒప్పందంపై ముందుకెళ్లడం సాధ్యం కాదని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ ఘాలిబాఫ్‌ అమెరికాకు తేల్చిచెప్పారు. దీంతో ఇజ్రాయెల్‌ తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సీరియస్‌ అయ్యారు. ఇరాన్‌తో ఒప్పందానికి చేరువలో ఉన్నామని, సైనిక దాడులు వెంటనే ఆపాలని స్పష్టంచేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events