
తెలుగు భాషకు ఉత్తర అమెరికాలో విశేషంగా కృషి చేస్తున్న ‘సిలికానాంధ్ర మనబడి’ జూన్ లో నిర్వహించిన వార్షిక స్థానిక ఉపాధ్యాయుల సదస్సు విజయవంతమైనట్లు సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికాలోని అట్లాంట, కాలిఫోర్నియా, ఆరిఙోనా, ఫ్లోరిడా, ఇల్లినోయి తదితర రాష్ట్రాల్లో పాటు కెనడాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన 25 కు పైగా సదస్సులలో సుమారు 1550 మందికి పైగా ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, సమన్వయకర్తలు, ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. తెలుగు భాష అభివృద్ధి, నూతన బోధనా విధానాలు తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించారని తెలిపారు. ఈ ఏడాది సదస్సుల ప్రత్యేక ఆకర్షణగా ‘మన తరం’ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగాయని తెలిపారు. కార్యక్రమాల్లో సిలికానాంధ్ర మనబడి’ నేతలు రాజు చామర్తి, శాంతి కూచిబొట్ల, శ్రీదేవి గంటి, భాస్కర్ రాయవరం, ప్రసాద్ జోస్యుల , స్నేహ వేదుల, గౌతం కస్తూరి, డాంజి తోటపల్లి తదితరులు పాల్గొన్నట్టు తెలిపారు.





























