Skip to main content

Namaste NRI

విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్

అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర. త్రిష కథానాయికగా. వీఎఫ్‌ఎక్స్‌ ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న సినిమా కావడంతో, నాణ్యమైన వీఎఫ్‌ఎక్స్‌ కోసం చిత్రబృందం ఎక్కువ సమయం తీసుకోవడం జరిగింది. ప్రపంచప్రఖ్యాత వీఎఫ్‌ఎక్స్‌ నిపుణులు ఈ సినిమాకు పనిచేశారు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలూ పూర్తయినట్టు సమాచారం. అందుకే ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ని మేకర్స్‌ లాక్‌ చేశారు.

దసరా కానుకగా అక్టోబర్‌ 16న విశ్వంభర థియేటర్లలో విడుదల కానున్నది. మరణానంతర లోకాల నేపథ్యంలో దేవతలు, మానవుల మధ్య జరిగే సంఘర్షణే ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుందని ఇన్‌సైడ్‌ టాక్‌. విజువల్‌ వండర్‌గా దర్శకుడు వశిష్ట మల్లిడి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రంలో అషికా రంగనాథ్‌, కునాల్‌ కపూర్‌ కీలక పాత్రధారులు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడు.

Social Share Spread Message

Latest News