Skip to main content

Namaste NRI

వింటారా సరదాగా నుంచి రెండో గీతం చింగారి విడుదల

అశోక్‌ గల్లా, శ్రీగౌరీప్రియ జంటగా నటిస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ విసా- వింటారా సరదాగా. ఉద్భవ్‌ రఘు దర్శకత్వం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి చింగారి అనే పాటను విడుదల చేశారు. విజయ్‌ బుల్గానిన్‌ స్వరపరచిన ఈ గీతాన్ని సనారే రచించారు. సిద్‌ శ్రీరామ్‌, లిప్సిక ఆలపించారు.

చింగారి.. నా చిరునవ్వుల ఓ సింగారి.. బాగుందే నువ్వొచ్చాక అంటూ మెలోడీ ప్రధానంగా ఈ పాట సాగింది. ప్రేమలోని మధుర భావాల్ని ఆవిష్కరిస్తూ చక్కటి సాహిత్యంతో ఈ గీతం ఆకట్టుకునేలా ఉంది. అమెరికాలోని తెలుగు విద్యార్థుల నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్‌ తదితరులు చిత్ర తారాగణం.

Social Share Spread Message

Latest News