ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి హెచ్చరికలు చేశారు. తాము అనుకుంటే ఖమేనీ అంత్యక్రియల ప్రారంభ కార్యక్రమంలోనే అక్కడున్న నాయకులందరినీ ఒక్కదెబ్బతో చంపేవాళ్లమని వ్యాఖ్యానించారు. కానీ తమతో చర్చలు జరపడానికి ఎవరూ ఉండరనే కారణంతో వారిని వదిలేశామని అన్నారు.

ఆ దేశంలో మిగిలిన నాయకత్వాన్ని తాను నిర్మూలించగలనని, కానీ అలా చేయాలని తాను అనుకోవట్లేదని చెప్పారు. ఖమేనీ అంత్యక్రియల్లో వేలాది మంది ఇరానియన్లు కన్నీరు పెట్టుకోవడంపై ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఆ దేశ ప్రజలు ఖమేనీని ద్వేషిస్తున్నారని ఇంతకాలం తాను అనుకున్నట్లు తెలిపారు. తాను అనుకున్నదే నిజమై ఉండొచ్చని,అంత్యక్రియల సమయంలో ప్రజలు మొసలి కన్నీరు కార్చి ఉంటారని వ్యాఖ్యానించారు.





























