Namaste NRI

అమెరికా అధ్యక్ష భవనం వద్ద కలకలం

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. కాంప్లెక్స్‌ బయట గేటును ఓ కారు బలంగా ఢీకొంది. ఆ ఘటనలో వాహన డ్రైవర్‌ అక్కడిక్కడే మృతి చెందినట్లు అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ వెల్లడిరచింది. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. కాంప్లెక్స్‌ బయట గేటును బలంగా ఢీకొట్టింది అని వైట్‌ హౌస్‌ కార్యాలయం వెల్లడిరచింది.  ఇది గమనించిన భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయం చేసే ప్రయత్నం చేయగా, డ్రైవర్‌ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారని తెలిపింది.  ఈ ఘటనపై పోలీసులు, స్థానిక యంత్రాంగంతో కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు సీక్రెట్‌ సర్వీస్‌ విభాగం వెల్లడిరచింది. భద్రతకు సంబంధించి ఎటువంటి ముప్పు లేదని పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events