Skip to main content

Namaste NRI

భారతీయ విద్యార్థులకు ఓ గుడ్‌ న్యూస్

భారతీయులకు ఊరటనిచ్చే ఓ గుడ్ న్యూస్ చెప్పింది అమెరికా.  స్టూడెంట్ వీసాపై అమెరికాలో ఉంటున్న భారతీయులు.. భారత్‌తో సహా ఇతర దేశాల్లో పర్యటించాక వీసా స్టాంప్ అవసరం లేకుండానే దేశంలోకి అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. వీసా స్టాంప్ మాత్రమే కాకుండా.. ఎలాంటి ఇంటర్వ్యూలేవీ ఉండవని స్పష్టం చేసింది. స్టూడెంట్ వీసాదారులతో పాటూ ఓపీటీ ట్రెయింగ్‌లో ఉన్న వారికీ ఈ మినహాయింపు వర్తించనుంది.  ఈ ప్రకటనతో భారతీయ విద్యార్థులకు భారీ ప్రయోజనం చేకూరిందని పరిశీలకులు చెబుతున్నారు. వీసా జారీలో జాప్యం కారణంగా తల్లిదండ్రులు అమెరికాకు రాలేని పక్షంలో.. వారి పిల్లలు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా భారత్‌కు వెళ్లొచ్చే అవకాశం చిక్కింది. ఎఫ్-1 స్టూడెంట్ వీసాతో  పాటూ ఓపీటీపై ఉన్న వారు కూడా నిశ్చింతగా భారత్‌కు వచ్చి వెళ్లొచ్చు.

Social Share Spread Message

Latest News