Namaste NRI

సిలికానాంధ్ర మనబడి కెనడా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు మాటల పోటీలు

కెనడాలోని టొరంటో నగరంలో సిలికానాంధ్ర మనబడి కెనడా ఆధ్వర్యంలో తెలుగు మాటల పోటీలు ఘనంగా నిర్వహించారు. జూన్‌ 18న ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కేవలం మనబడి చిన్నారులే కాకుండా కెనడాలోని తెలుగు మాట్లాడే సుమారు 50 మంది పిల్లలు పాల్గొన్నారు. ఈ  పోటీలో పాల్గొన్న పిల్ల‌లు తమ ప్ర‌తిభాపాట‌వాలు ప్రదర్శించారు. ఈ తెలుగు మాట్లాట పోటీల్లో పదరంగం , తిరకాటం, ఒనిమా  అని మూడు సరదా పోటీలు నిర్వ‌హించారు. ఈ పోటీల ద్వారా మ‌న భాష‌పై పిల్ల‌ల‌కు ఆస‌క్తి పెంచ‌డానికి మంచి ప్ర‌య‌త్నం జ‌రిగింది.

5-9 సంవత్సరాల కేటగిరిలో పదరంగం పోటీల్లో అనీష్‌ కప్పగంతుల ప్రథమ స్థానం సాధించగా, గీతిక పోతిరెడ్డి ద్వితీయ స్థానంలో నిలిచింది. తిరకాటంలో చార్విశ్రీ రాళ్లపల్లి, గీతిక పోతిరెడ్డి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. ఒనిమా పోటీలో గీతిక పోతిరెడ్డి మొదటిస్థానంలో నిలవగా, చార్వశ్రీ రాళ్లపల్లి రెండో స్థానంలో నిలిచింది. 10`15 సంవత్సరాల కేటగిరీలో పదరంగం ప్రథమ విజేతగా అద్వైత్‌రెడ్డి చిన్నకలప్ప నిలిచాడు. తన్వి వడ్రేవు రెండో స్థానం సాధించారు. తిరకాటం  పోటీలో  జనని దేవినేని, రాజ్‌దీప్‌ యనమలచింతల  ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు.  ఒనిమాలో శ్రేయాస్‌ నేతి ప్రథమ, అధ్వైత్‌ రెడ్డి చిన్నకల్ప ద్వితీయ స్థానాలు సాధించారు.

ఈ టొరంటో ప్రిలిమినరీ రౌండ్స్‌లో గెలిచిన పిల్లలు సెప్టెంబర్ మొదటి వారాంతం అమెరికాలో డ‌ల్లాస్‌లో జరిగే అంతర్జాతీయ అంతిమ పోటీల్లో పాల్గొంటారు. మన మాతృభాషను కాపాడుకుంటూ ఆ భాషానిధిని భవిష్యత్ తరానికి అందించాలనేది మనబడి లక్ష్యం. ఓనమాల ఒడి, తెలుగు తల్లి గుడి – సిలికానాంధ్ర మనబడి. తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్పూర్తిని చాటాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ప్రారంభమైన సిలికానాంధ్ర మనబడి  ఖండాంతరాలకు విస్తరించింది.

సిలికానాంధ్ర మనబడి కెనడా విభాగం 2013 లో ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థగా రికార్డైంది. నాటి నుంచి సుమారు 1500 పైగా విద్యార్థులతో దినదిన ప్రవర్ధమానం చెందుతూ తెలుగు సంప్రదాయ స్ఫూర్తిని చాటుతోంది. తెలుగు భాష మీద ఉన్న మక్కువతో ఎందరో భాషా సైనికులు ఉపాధ్యాయులుగా, సమన్వయకర్తలుగా స్వచ్ఛంద‌ సేవ చేస్తున్నారు.  నిర్దిష్ట పాఠ్య ప్రణాళికతో తెలుగు పాఠ్యంశాలు బోధిస్తూ, బాలానందం, పిల్లల పండుగ, మాట్లాట తదితర కార్యక్రమాలతో పిల్లలలో ఆత్మ విశ్వాసం, భావ వ్యక్తీకరణ నైపుణ్యం, నాయకత్వ పటిమలను పెంపొందిస్తున్న‌ది. మీ పిల్లలను మనబడి  లో నమోదు చేయాలనుకుంటే మీ సమీప మనబడి కేంద్ర సమన్వయకర్తను సంప్రదించండి. మరిన్ని వివరాలకు https://manabadiportal.siliconandhra.org/ ని సందర్శించండి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events