Skip to main content

Namaste NRI

భారత విదేశాంగ శాఖ కీలక నిర్ణయం.. ఉక్రెయిన్‌ లోని

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మరింత ముదురుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా పోలాండ్‌కు తరలిస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని పరిస్థితులు, భద్రతా ప్రమాణాలు, బాంబు దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. రష్యా, ఉక్రెయిన్‌ పరిస్థితులు, దేశ భద్రత అంశాలపై ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం తరువాత ఉక్రెయిన్‌ ఎంబసీని తాత్కాలికంగా పోలాండ్‌కు తరలించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.తరువాత పరిస్థితులనే బట్టి, మరిన్ని నిర్ణయాలు ఉంటాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌, విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News