Namaste NRI

రిషి సునాక్‌ కేబినెట్‌లో కీలక పరిణామం … మంత్రి బ్రెవ‌ర్‌మాన్‌పై

బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ కేబినెట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది.  హోంశాఖ‌ మంత్రి సుయిల్లా బ్రెవ‌ర్‌మాన్‌ పై  సునాక్ వేటు వేశారు. ఆమెను మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించారు. పాల‌స్తీనాకు అనుకూలంగా తీసిన ర్యాలీ విష‌యంలో పోలీసుల‌పై చేసిన వ్యాఖ్య‌లకు గాను ఆమెను మంత్రి స్థానం నుంచి తొల‌గించిన‌ట్లు తెలుస్తోంది. పాల‌స్తీనాకు అనుకూలంగా తీసిన‌ ర్యాలీ విష‌యంలో పోలీసులు వ్య‌హ‌రించిన తీరును ఖండిస్తూ మంత్రి బ్రెవ‌ర్‌మాన్ ఓ ప‌త్రిక‌లో వ్యాసం చేశారు. ఆ వ్యాసంలో ఆమె ప్ర‌ధాని సునాక్ తీరును త‌ప్పుప‌ట్టారు. ప‌త్రిక వ్యాసంలో ఆ మంత్రి వెల్ల‌డించిన అభిప్రాయాల వ‌ల్ల ఘ‌ర్ష‌ణ‌లు మ‌రింత ఉదృతం అయ్యాయి. దీంతో నిర‌స‌న‌కారులు లండ‌న్ వీధుల్లో భారీ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని రిషి సునాక్ కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకోవాల్సి వ‌చ్చింది. బ్రెవ‌ర్‌మాన్ ను వ్య‌క్తిగ‌తంగా స‌మ‌ర్థించినా,  ఆమెను మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గిస్తున్న‌ట్లు సునాక్ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events