Skip to main content

Namaste NRI

భారత సంతతి వ్యక్తికి కీలక పదవి

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వంలో భారతీ సంతతి వారి  ప్రాముఖ్యం పెరుగుతోంది. తాజాగా మరో ఇండియన్‌ అమెరికన్‌కు కీలక పదవి చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. స్లోవేకియాకు కొత్త రాయబారిగా గౌతమ్‌ రాణాను ఎంపిక చేసేందుకు బైడెన్‌ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ కీలక ప్రకటన చేసింది. అమెరికా విదేశాంగ శాఖలో సీనియఱ్‌ అధికారి అయిన రాణా ప్రస్తుతం ఆల్జీరియాలోని అమెరికా ఎంబసీలో డిప్యూటీ చీఫ్‌గా సేవలందిస్తున్నారు. ఆయనకు గతంలోనే స్లేవేనియాలో పనిచేసిన అనుభవం ఉంది. యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సీల్వేనియా నుంచి డిగ్రీ పట్టా పొందిన ఆయన నేషనల్‌ డిఫెన్స్‌ యూనివర్సిటీలో ఎమ్మే చేశారు. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, స్పానిష్‌, గుజరాతీ భాషల్లో ఆయనకు మంచి పట్టు ఉంది.

Social Share Spread Message

Latest News