తమ దేశంలో కొత్తగా మూడు ప్రాణాంతక మిడిల్-ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(మెర్స్) కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 10 నుంచి 17వ తేదీ మధ్యలో ఈ కేసులు నమోదయ్యాయని, వైరస్ బారిన పడ్డ ముగ్గురిలో ఒకరు మరణించారని తెలిపింది. 56 నుంచి 60 ఏండ్ల మధ్య వయస్కులైన రియాద్‌కు చెందిన పురుషులకు వైరస్ సోకిందని తెలిపారు. వీరికి ఒంటెల నుంచి వైరస్ వ్యాపించిందని భావిస్తున్నారు.