ఆస్ట్రేలియాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన హేమంత్ ధన్‌జీ నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన భారత మూలాలు ఉన్న తొలి వ్యక్తి ఆయనే కావడం విశేషం. 1990లో ఆయన న్యాయవాద వృత్తిని చేపట్టారు. క్రిమినల్ చట్టాల్లో ఆయనకు విశేష ప్రావీణ్యం ఉంది. ఆయనను అభినందిస్తూ ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
