అమెరికాలో భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం లభించింది. భారత సంతతికి చెందిన వైభవ్ మిట్టల్‌ను ఆరెంజ్ కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తిగా కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ నియమించారు. ఈ క్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. ఆరెంజ్ కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి సౌత్ ఆసియన్ వ్యక్తిగా మిట్టల్ వైభవ్ గుర్తింపు పొందారు. దీంతో రొనాల్డ్ ఎల్ బాయర్ స్థానాన్ని వైభవ్ మిట్టల్ భర్తీ చేశారు. వైభవ్ మిట్టల్ గతంలో సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియాలో అసిస్టెంట్ యూఎస్ అటార్నీ జనరల్‌గా పని చేశారు. అనంతరం డిప్యూటీ చీఫ్‌గా ప్రమోట్ అయ్యారు. పొలిటికల్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి వైభవ్ మిట్టల్ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. ఇర్విన్ స్కూల్ ఆఫ్ లా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో లెక్చరర్‌గా వైభవ్ మిట్టల్ పని చేశారు.