నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ (ఎన్‌ఎఎస్‌డిపి), ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్‌సిఎహెచ్‌ఆర్), యుఎన్‌ఒ ముఖ్యమైన విభాగం ఎన్‌ఎటిఓతో రిజిస్టర్ చేయబడిన యూరోపియన్ యూనియన్. సీనియర్ నటుడు వీకే నరేష్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యునైటైడ్ నేషన్స్‌లోని ముఖ్య విభాగం నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. ఫిలిప్పీన్స్‌లోని మనీలా క్యూజోన్ నగరంలో జరిగిన కార్యక్రమంలో ఆయనను సర్ బిరుదుతో సత్కరించడంతో పాటు గౌరవ డాక్టరేట్‌ను అందించారు. ఈ సమావేశానికి నేషనల్ ఆకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ జనరల్ దివాకర్ చంద్ర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వీకే నరేష్ మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో వివిధ దేశాల ప్రభుత్వాలు, ఐక్యరాజ్య సమితి గొప్పగా కృషి చేస్తున్నాయి. మీడియా కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నది. సినీరంగంలో యాభై ఏండ్లు పూర్తి చేసుకున్న ఈ తరుణంలో అంతర్జాతీయ సంస్థ నుంచి గౌరవ డాక్టరేట్ పొందడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.




























