Skip to main content

Namaste NRI

ఇరాన్‌ కు ఎలాంటి నియంత్రణ లేదు … అది పూర్తిగా మా ఆధీనంలోనే

ప్రస్తుతం హొర్ముజ్‌ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉన్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. తాను ఇరాన్‌ను నమ్మబోనని వెల్లడించారు. తన ఓహియో పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడారు. హొర్ముజ్‌పై ఇరాన్‌ కు ఎలాంటి నియంత్రణ లేదు. అది పూర్తిగా మా ఆధీనంలోనే ఉంది అని ఆయన తెలిపారు.
ఒక వైపు హొర్ముజ్‌ జలసంధి పూర్తిగా తమ ఆధీనంలో ఉందని డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొంటుండగా, అలాంటిదేమీ లేదని టెహ్రాన్‌ కొట్టివేసింది. హొర్ముజ్‌ జలసంధిని ఎట్టి పరిస్థితుల్లో తెరవబోమని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ స్పష్టం చేసింది. యుద్ధంలో జరిగిన నష్టానికి పరిహారం చెల్లింపు సహా పలు డిమాండ్లను అమెరికా అంగీకరించే వరకు జలసంధి మూసివేత కొనసాగుతుందని తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events