Skip to main content

Namaste NRI

భారతీయుడికి అరుదైన గౌరవం

 లులు ఫైనాన్షియల్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అదీబ్‌ అహ్మద్‌కు బ్రహెయిన్‌లో అరుదైన గౌరవం దక్కింది. గోల్డెన్‌ రెసిడెన్సీ వీసాతో బహ్రెయిన్‌ ప్రభుత్వం ఆయనను గౌరవించింది. బహ్రెయిన్‌ డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ చేతుల మీదుగా గోల్డెన్‌ వీసా అందుకున్నారు. అంతేకాకుండా బ్రహెయిన్‌ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బహ్రెయిన్‌ను వ్యాపార కేంద్రంగా మార్చడానికి గోల్డెన్‌ వీసా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కేరళలో జన్మించిన అదీబ్‌ అహ్మద్‌ యూఏఈ వెళ్లి అక్కడ బిలియనీర్‌గా ఎదిగారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సౌత్‌ ఆసియా రిజినల్‌ స్ట్రాటజీ గ్రూప్‌ అడ్వైజరీ బోర్డు సభ్యులుగా ఉన్నారు.

Social Share Spread Message

Latest News