Skip to main content

Namaste NRI

ఎన్నారై కృష్ణ ప్రసాద్ కు అరుదైన గౌరవం

అమెరికాలో తెలుగు ఎన్నారైకి అరుదైన గౌరవం దక్కింది. 2022లో బోస్టన్ ఎక్స్‌లెంట్ వాలంటీర్ అవార్డు గ్రహీత అయిన సోంపల్లి కృష్ణ ప్రసాద్ నవంబర్ 7న 70 మిలియన్స్ బడ్జెట్ గల బోస్టన్ ఫ్రాంక్లిన్ టౌన్‌లో స్కూల్ కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 90శాతం శ్వేతజాతీయులు ఉన్న ఫ్రాంక్లిన్ టౌన్‌లో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అనేది చాలా కష్టతరమైన పని. కానీ, కృష్ణ ప్రసాద్‌కు ఉన్న నిస్వార్థమైన సేవాభావంతో శ్వేత జాతీయులు హృదయాన్ని గెలుచుకున్నారు. ఒక భారతీయుడు మొదటి సారిగా టౌన్ గవర్నమెంట్‌లో అధికారం పొందడం పట్ల స్థానిక భారతీయులు అందరు గర్విస్తున్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Social Share Spread Message

Latest News