Skip to main content

Namaste NRI

తెలంగాణా వాసికి అరుదైన గౌరవం

సౌత్‌ ఇండియా నుంచి మొట్టమొదటిసారి తెలంగాణ వ్యక్తికి గౌరవం దక్కింది. సౌతాఫ్రికా ఐటీ టాస్క్‌ టీం చైర్‌ పర్సన్‌గా గుర్రాల నాగరాజు నియామకం అయ్యారు. ఈ సందర్భంగా గుర్రాల నాగరాజు మాట్లాడుతూ సౌతాఫ్రికా`ఇండియా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. సీఐఐ ఇండియా బిజినెస్‌ ఫోరమ్‌ కార్పొరేట్‌ సభ్యుల ప్రత్యేక సమూహం. సీఐఐ`ఐబీఎఫ్‌ (ఎస్‌ఏ) ఆసక్తి గల కంపెనీల ప్రతినిధుల బృందాలను కూడా నిర్వహిస్తుంది. కొత్త వ్యాపార అవకాశాలకు, వ్యాపార సహకారం కోసం కొత్త మార్గాలను చూపిస్తుందని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన సీఐఐ ఇండియా బిజినెస్‌ ఫోరమ్‌( దక్షిణాఫ్రికా)కి ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను అన్ని రకాలుగా అందరికి ఆమోద యోగ్యంగా నిర్వహిస్తానని తెలిపారు.

Social Share Spread Message

Latest News