Skip to main content

Namaste NRI

దీపావళికి అరుదైన గుర్తింపు… న్యూయార్క్‌లో

చీకటిని పారదోలి అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపే దీపావళి పండగకు అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన గుర్తింపు ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే ఈ పండగ వేడుకలు అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ లో కూడా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న దీపావళి పండగ మరో మైలురాయిని అందుకుంది. దీపావళి రోజు ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించే బిల్లుపై న్యూయార్క్‌ గవర్నర్‌ కాథీ హూచల్‌ సంతకం చేశారు. ఈ సందర్భంగా కాథీ హుచల్‌ మాట్లాడుతూ న్యూయార్క్‌ సిటీలో ఎన్నో మతాల వాళ్లు కలిసిమెలిసి నివసిస్తున్నారని చెప్పారు. ఈ వైవిధ్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు.

Social Share Spread Message

Latest News