Skip to main content

Namaste NRI

నందమూరి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ .. హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న తేజస్విని?

నటసింహం నందమూరి బాలకృష్ణ కుటుంబం నుంచి మరొక‌రు ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్ట‌నున్నార‌నే వార్తలు ఫిలింనగర్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నందమూరి త్వరలోనే వెండితెరపై కనిపించనున్నారనే ప్రచారం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక మంచి సామాజిక సందేశాన్ని అందించే స్పోర్ట్స్ డ్రామా ద్వారా ఆమె నటిగా పరిచయం కానున్నట్లు సమాచారం.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వ్యక్తిగత జీవితంలో తేజస్విని, విశాఖపట్నం ఎంపీ మరియు గీతం విద్యాసంస్థల అధినేత ఎం. శ్రీభరత్‌ను వివాహం చేసుకున్నారు. కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూనే సినీ రంగానికి సంబంధించిన పలు కీలక వ్యవహారాల్లో కూడా ఆమె చురుకుగా పాల్గొంటున్నారు.

Social Share Spread Message

Latest News