Skip to main content

Namaste NRI

ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన థ్రిల్లర్‌ : సుమంత్‌

సుమంత్‌ కథానాయకుడిగా తెరకెక్కిన యూనిక్‌ థ్రిల్లర్‌ న్యూటన్స్‌ థర్డ్‌ లా. రాజేశ్‌ కర్ణ దర్శకుడు. కె.హరీశ్‌ నిర్మాత. ఈనెల 31న విడుదల కానున్నది. ఈ సినిమా ప్రీమియర్స్‌కి మంచి స్పందన రావడంతో హైదరాబాద్‌లో నిర్వహించిన యాక్షన్‌ రియాక్షన్‌ ఈవెంట్‌ లో సుమంత్‌ మాట్లాడారు. ఇది కొత్త తరహా థ్రిల్లర్‌. ఇందులో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా ఉన్నాయి. మన సంస్కృతికి చెందిన అంశాలను, పాత్రలను సింబలైజ్‌ చేస్తూ ఈ సినిమా తీశారు అని అన్నారు.

ఈ సినిమాలో థ్రిల్‌, ఎమోషన్‌, ఎైగ్జెట్మెంట్‌ అన్నీ ఉంటాయని దర్శకుడు రాజేశ్‌కర్ణ చెప్పారు. థ్రిల్లర్‌ జానర్లో కొత్తగా ఉండే కంటెంట్‌ ఇదని కథానాయిక నేహ తెలిపారు. ఇంకా నిర్మాత హరీశ్‌, నటులు రవివర్మ, త్రినాథ్‌, డీవోపీ వేదవ్యాస్‌ కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events