Namaste NRI

జో బైడెన్‌కు ఆ దేశ దౌత్యవేత్తల హెచ్చరిక

హమాస్‌పై ప్రతీకారంగా పాలస్తీనాలోని గాజాపై తీవ్ర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు నేపథ్యంలో అరబ్‌ దేశాల ప్రజా మద్దతును ఘోరంగా కోల్పోతున్నట్లు ఆ దేశ దౌత్యవేత్తలు హెచ్చరించారు. అరబ్‌ దేశాల్లోని అమెరికా దౌత్యవేత్తలు ఈ మేరకు రూపొందించిన నివేదికలను అధ్యక్షుడు జో బైడెన్‌ పాలనా యంత్రాగానికి పంపారు. ఇజ్రాయెల్‌కు అన్నింటా మద్దతుగా ఉన్న బైడెన్‌ ప్రభుత్వ వైఖరి వల్ల ఒక తరం అరబ్ ప్రజానీకాన్ని అమెరికా కోల్పోతోంది అని ఆ రిపోర్ట్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ యుద్ధ నేరాలకు సంబంధించిన రిపోర్ట్‌ను ఒమన్‌లోని అమెరికా దౌత్యాధికారులు రూపొందించారు. అరబ్‌ దేశాలతో సంబంధ వ్యవహారాల్లో ఘోరంగా ఓడిపోతున్నాం  అని హెచ్చరించారు.

కాగా, పాలస్తీనియన్ల పట్ల నిర్లక్ష్యం, క్రూరత్వంలో జో బైడెన్‌ మునుపటి అమెరికా అధ్యక్షులందరినీ మించిపోయినట్లు విమర్శించారు. ఈ నేపథ్యంలో కైరోలోని అమెరికా దౌత్యవేత్తలు తమ రిపోర్ట్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. వైట్‌హౌస్ జాతీయ భద్రతా మండలి, సీఐఏ, ఎఫ్‌బీఐతోపాటు ఇతర అమెరికా జాతీయ సంస్థలకు ఈ నివేదికలు పంపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events